"వలయం" సినిమాతో హీరోగా పరిచయమైన లక్ష్ చదలవాడ నటిస్తున్న కొత్త చిత్రం "గ్యాంగ్ స్టర్ గంగరాజు". ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. వేదిక దత్ హీరోయిన్. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జూన్ 24న తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో సినిమాపై తగిన బజ్ క్రియేట్ అయ్యింది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి స్నీక్ పీక్ పేరిట మొదటి నాలుగు నిమిషాల సినిమాను రిలీజ్ చేసారు. ట్రైలర్ లాగానే ఈ వీడియో కూడా ప్రేక్షకుల నుండి విశేష స్పందన దక్కించుకుంటుంది. లక్ష్ ఇంటెన్స్ యాక్టింగ్, ఇషాన్ సూర్య స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలవనున్నట్టు తెలుస్తుంది. సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు సరిగ్గా సింక్ అవుతూ, నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే విధంగా ఉంది.