మెగా ఫ్యామిలీకి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మధ్య స్నేహపూర్వక సంబంధాలున్నాయని అందరికి తెలిసిందే. చెర్రీ హిందీ డిబట్ "తుఫాన్" సమయంలో సల్మాన్ అన్నీ దగ్గరుండి చూసుకున్నారట. ముంబైలో చెర్రీకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, తన ఇంటి నుండే భోజనాన్ని కూడా పంపించేవారట. వీరి మధ్య ఉన్న అన్యోన్యతతోనే మెగాస్టార్ గాడ్ ఫాదర్ లో సల్మాన్ గెస్ట్ రోల్ చెయ్యటానికి ఒప్పుకున్నాడట. అంతేకాక ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదని టాక్.
ఇదిలావుంటే, తాజాగా సల్మాన్ కొత్త సినిమా "కభీ ఖుషీ కభీ దివాళి" సినిమాలో చెర్రీ నటించబోతున్నాడంటూ పలు రకాల వార్తలు నిన్నటి నుండి మీడియాలో హోరెత్తిపోతున్నాయి. ఈ ప్రాజెక్ట్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సల్మాన్, వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమాలో చెర్రీ ఒక స్పెషల్ సాంగ్ లో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారట. సల్మాన్, వెంకీలతో కలిసి చెర్రీ స్టెప్పులేయనున్నాడన్నమాట. ఇందుకు చెర్రీ కూడా సల్మాన్ లాగానే ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించడానికి ఒప్పుకున్నాడట. చెర్రీ చేసిన ఈ పనితో సల్మాన్ ఫుల్ ఫిదా అయిపోయాడట. ఐతే, ఈ న్యూస్ లో ఎలాంటి అధికారిక సమాచారం లేదనుకోండి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా, ఈ డిసెంబర్ కు సినిమా విడుదలకానుంది.