బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన "నో ఎంట్రీ" చిత్రం ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు. 2005లో విడుదలైన ఈ చిత్రానికి అనీజ్ బజ్మీ డైరెక్టర్ కాగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఐదుగురు బాలీవుడ్ భామలు తమ గ్లామర్ షోతో అలరించారు. బిపాసాబసు, ఇషా డియోల్, లారా దత్త, సెలీనా జైట్లీ, ప్రత్యేక పాత్రలో సమీరా రెడ్డి వంటి గ్లామరస్ హీరోయిన్లు నటించారు.
తాజాగా ఈ సినిమాకు "నో ఎంట్రీ 2" పేరిట సీక్వెల్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు సల్మాన్. ఫస్ట్ పార్ట్ లో ఐదుగురు హీరోయిన్లు నటించగా, రెండో పార్ట్ లో ఏకంగా పది మంది హీరోయిన్లను రంగంలోకి దింపే మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. ఈ పది మందిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా ఉండడం విశేషం. సమంత, రష్మిక మండన్నా, పూజా హెగ్డే, తమన్నా వంటి టాలీవుడ్ ముద్దగుమ్మలను ఈ సినిమాలో నటించేలా చేసి, సౌత్ లో కూడా ఈ సినిమాకు మంచి మార్కెట్ ఏర్పరచుకోవాలనుకుంటున్నాడు. ఈ నలుగురిలో తమన్నా అనిల్ కపూర్ కు జోడిగా, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో, రష్మిక, సమంత సల్లూ భాయ్ కు జోడిగా నటించనున్నారట. కానీ, సమంత, రష్మిక ఒకే సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించట్లేదట. ఒకవేళ కనక ఈ ఇద్దరూ ఒప్పుకుని, ప్రాజెక్ట్ పట్టాలెక్కితే నార్త్, సౌత్ హీరోయిన్ల గ్లామర్ షోకు సిల్వర్ స్క్రీన్ షేక్ అవుతుందేమో!