విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హిట్: ది ఫస్ట్ కేస్. హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపురనేని నిర్మించిన ఈ సినిమా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కి సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని అదే టైటిల్ తో హిందీలో రీమేక్ చేశారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తో కలిసి టి - సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించారు. బాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో రాజ్ కుమార్ రావ్, దంగల్ ఫేమ్ సాన్యా మల్హోత్రా ఇందులో జంటగా నటించారు. హిందీలో కూడా శైలేష్ కొలను దర్శకుడిగా వ్యవహరించారు. జూలై 15వ తేదీన విడుదలవబోతున్న ఈ సినిమా పట్ల ఉత్తరాదిన పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నాయి.
తాజాగా హిట్ మూవీ టీం ట్రైలర్ ను విడుదల చేసింది. తెలుగు హిట్ సినిమా మాదిరిగానే ఎంతో ఉత్కంఠగా సాగింది. అద్భుతమైన విజువల్స్ తో, స్టైలిష్ టేకింగ్ తో తెలుగు హిట్ ఇంటెన్సిటీ ని హిందీలో మెయిన్ టైన్ చెయ్యటంలో శైలేష్ గ్రాండ్ సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది. వెండితెరపై మ్యాజిక్ చేస్తే హిందీ హిట్ తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది.