లాక్ డౌన్ టైం లో చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా ఫిలిం ఇండస్ట్రీని ఆదుకున్న సంస్థ ఓటిటి రంగం. గత రెండేళ్లుగా చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు పలు ఓటిటీలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఇదిలా ఉండగా, ఒక బాలీవుడ్ హీరో ఓటిటిలో నటించటాన్ని చులకన చేసి మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది.
తానొక బాలీవుడ్ నటుడినని, ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించనని, ఇండియాలో టాప్ ఫిలిం ఇండస్ట్రీ బాలీవుడ్డేనని వ్యాఖ్యానించి వివాదాస్పదమైన బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం తాజాగా మరోసారి నోరుజారి మాట్లాడారు. తనొక బిగ్ స్క్రీన్ హీరోనని, తనకు అక్కడ నటించడమే ఇష్టమని, రూ. 299, రూ. 499 లకు లభించే ఓటిటిలో నటించటం తనకిష్టం లేదని చెప్పారు. ఓటిటీని కించపరుస్తూ జాన్ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీసాయి. దీంతో జాన్ ను నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.