నటీనటులకు కాస్త క్రేజ్, డిమాండ్ ఏర్పడితే చాలు రెమ్యునరేషన్ పెంచేస్తారనే టాక్ ఉంది. రెమ్యునరేషన్ తో పాటు బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్లు బుక్ చెయ్యాలని, ఫైవ్ స్టార్ హోటల్ లో బస ఏర్పాటు చెయ్యాలని, తనకే కాకుండా తనతో వచ్చే వారందరికీ ఈ షరతులు వర్తించాలని నిర్మాతలను ఇబ్బంది పెట్టే ఎంతోమంది హీరోయిన్లు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు.
తాజాగా ఈ లిస్టులోకి నేషనల్ క్రష్ రష్మిక మండన్నా కూడా చేరింది. తనను విడిచి తన పెంపుడు కుక్క ఉండలేదని, దీంతో తనకు కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చెయ్యాలని నిర్మాతలను డిమాండ్ చేస్తుందట.
పెంపుడు కుక్కలను అన్ని ఎయిర్ లైన్స్ అనుమతించవు. అంతేకాక, కుక్కల విమాన ప్రయాణానికి కొన్ని నియమనిబంధనలు ఉంటాయి. వీటికోసం నిర్మాతలు అదనంగా ఖర్చు చేయాల్సిఉంటుంది. రష్మిక వంటి టాప్ హీరోయిన్ ను బుక్ చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవనుకుంటూ నిర్మాతలు రష్మిక డిమాండ్ మేరకు ఆమె ఏది అడిగితే అది చేస్తున్నారట.