1991లో విడుదలైన విక్టరీ వెంకటేష్ హిట్ సినిమా "కూలీ నెం.1" తో టాలీవుడ్ కి పరిచయమైన బాలీవుడ్ హీరోయిన్ టబు. ఆపై ఎన్నో హిట్ సినిమాలలో నటించిన టబు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. ఈ యాభై ఏళ్ళ సీనియర్ హీరోయిన్ ఇప్పటికీ సినిమా రంగంలో కొనసాగుతుంది. కానీ, ఇప్పటివరకు టబు పెళ్లి చేసుకోలేదు. ఈ విషయం పట్ల టబుకు ప్రతిసారి, ప్రతి చోటా ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. తొలిసారి ఈ విషయంపై నోరు విప్పిన టబు, తను సింగిల్ గా ఉండడానికి స్టార్ హీరో అజయ్ దేవగణ్ ప్రధాన కారణమని చమత్కరించింది.
ఆమె మాట్లాడుతూ... తన కజిన్ సమీర్ ఆర్య పక్కింట్లో అజయ్ కుటుంబం నివాసముండేదని, వీళ్ళిద్దరూ కలిసి తనపై నిఘా ఉంచేవారని, ఏ అబ్బాయైనా తనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే, అతన్ని పట్టుకుని కొట్టి, మరోసారి మాట్లాడొద్దని బెదిరించేవారని చెప్పుకొచ్చింది. తన జీవితంలో వీరిద్దరూ రౌడీలని, వీళ్ళవల్లే తన పెళ్లి అవ్వలేదని, ఈ విషయం పట్ల అజయ్ రిగ్రెట్ ఫీల్ అవ్వాలని తెలిపింది.