టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు రాజమౌళి సినిమాలో అవకాశం వస్తే, రిజెక్ట్ చేసే నటీనటులెవరైనా ఉంటారా...? ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో జక్కన్న సినిమాను రిజెక్ట్ చేసిన ఏకైక నటుడు రియల్ హీరో సోనూసూద్.
రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సోనూసూద్ మాట్లాడుతూ... బాహుబలి 2 కోసం జక్కన్న టీం తనను అప్రోచ్ ఐన విషయాన్ని బయటపెట్టాడు. బాహుబలి 2 షూటింగ్ కోసం రాజమౌళి మల్టిపుల్ వర్కింగ్ డేట్స్ అడగడంతో, ఆల్రెడీ కమిటైన సినిమాల షూటింగులతో తన డేట్స్ ను సర్దుబాటు చెయ్యలేక సోనూసూద్ బాహుబలి 2ని రిజెక్ట్ చేశారట. ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు జక్కన్న బాహుబలి 2 లో సోనుకు ఏ రోల్ ను ఆఫర్ చేసాడో తెలుసుకోవాలని కుతూహలం గా ఉన్నారు. కానీ, సోనూ తనకు ఏ రోల్ ను ఆఫర్ చేసారో రివీల్ చెయ్యలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa