"ఆచార్య"తో కెరీర్లో ఎన్నడూలేని విధంగా డైజెస్టర్ ను, విమర్శలను ఒకేసారి ఎదుర్కొన్నాడు టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ. మెగా ఇమేజ్ ను హ్యాండిల్ చెయ్యడంలో కొరటాల పూర్తిగా విఫలమయ్యాడని మెగా అభిమానులు కొరటాలపై మండిపడ్డారు. ఆ నెగిటివిటి నుండి చాలా త్వరగానే బయటకు వచ్చాడు కొరటాల. ఆచార్య విడుదలైన నెలకే తారక్ తో 30వ సినిమాను ప్రకటించి, మోషన్ పోస్టర్ తో అందరి నోళ్లను మూయించాడు. ఐతే, కొంతమంది ఆ మోషన్ పోస్టర్ లో కూడా తప్పులు వెతికారనుకోండి. ఈ విషయం పక్కన పెడితే, జూన్ అంటే ఈ నెల్లోనేమూవీ షూటింగ్ మొదలుకావలసింది కానీ కొన్ని కారణాల వల్ల ఆగస్టుకు వాయిదా పడిందని టాక్. ఆ కారణమేంటని ఆరా తీయగా, సినిమాలో ఉండబోయే ఒక భారీ సెట్టింగ్ కోసమని తెలిసింది. క్లైమాక్స్ లో ఈ భారీ సెట్ ను బ్లాస్ట్ చేస్తారట. ఈ ఎపిసోడ్ లో తారక్ అండ్ విలన్ ల కాంబోలో వచ్చే పవర్ఫుల్ డైలాగులు ఖచ్చితంగా ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టిస్తాయంట. ప్రస్తుతానికి ఈ భారీ సెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయట. రోజురోజుకూ పెరుగుతున్న అంచనాలతో షూటింగ్ ఎప్పుడు స్టార్ అవుతుందా? అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa