మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' సినిమా చేస్తున్నారు. ఇందులో విలన్‌గా సముద్రఖని, విజయ్ సేతుపతి పేర్లను పరిశీలించారు. చివరికి మలయాళ స్టార్ నటుడు బిజూమీనన్ ఖరారైనట్లు సమాచారం. అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాతో బాగా పాపులర్ అయిన బిజూమీనన్ తెలుగులో రణం సినిమాలో నటించారు. అండర్ కవర్ పోలీస్‌గా చిరు నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ, శృతిహాసన్ కీలకపాత్రలు పోషించనున్నారు.