ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బండ్ల గణేష్ కుటుంబంలో వివాహ వేడుక

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 23, 2018, 04:44 PM

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబంలో వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. బండ్ల గణేశ్ పెద్ద సోదరుడి కుమార్తె ఆశ్రిత వివాహం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో ఈరోజు జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి హాజరై వధూవరులను ఆశీర్వదించి.. అభినందించారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం దంపతులు, శ్రీకాంత్ దంపతులు, రాజశేఖర్ - జీవిత దంపతులు, నటుడు గోపీచంద్ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa