గణతంత్ర దినోత్సవం వేళ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు మొత్తం 131 మందిని ఎంపిక చేసింది. ఐదుగురికి పద్మ విభూషణ్ , 13 మంది పద్మ భూషణ్, 113 మందిని పద్మశ్రీకి ఎంపిక చేసింది. వీరిలో 19 మంది మహిళలు, ఆరుగురు విదేశీయులు, 16 మందికి మరణానంతరం అవార్డులు వచ్చాయి. ఇక, కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ (రాజకీయం), బాలీవుడ్ దివంగత నటుడు ధర్మేంధ్ర (కళా రంగం), కేటీ థామస్ (కేరళ-ప్రజా సంబంధాలు), నారాయణన్ (రచయిత-కేరళ), ఎన్-రాజమ్ (కళ-ఉత్తర్ ప్రదేశ్)లకు పద్మవిభూషణ్ వరించింది.
మలయాళ నటుడు మమ్ముట్టి, ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ఝార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ (మరణానంతరం), అద్మాన్ పియూష్ పాండే (మరణానంతరం), కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్, సింగర్ అల్కా యాజ్ఞిక్, మాజీ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృత్‌రాజ్, వివాదాస్పద మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ప్రముఖ కేరళ సామాజిక నేత, ఎస్ఎన్డీపీ యోగం సుప్రీం వెల్లపల్లి నటేషన్, బీజేపీ మాజీ ఎంపీ వీకే మల్హోత్రాలను పద్మభూషణ్‌లకు ఎంపికి చేసింది. క్రికెటర్ రోహిత్ శర్మ, హర్మాన్‌ప్రీత్ కౌర్‌లకు పద్మశ్రీ వరించింది.
అవార్డు విజేతల్లో మారుమూల, వెనుకబడిన ప్రాంతాలు సహా వివిధ ప్రాంతాలకు చెందినవారు. దశాబ్దాలుగా అట్టడుగు స్థాయిలో పనిచేశారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, జీవనోపాధి కల్పన, పారిశుద్ధ్యం, పర్యావరణ స్థిరత్వం, సాంప్రదాయ కళలు, వారసత్వ పరిరక్షణ వంటి రంగాల్లో సేవలు అందించారు. అనేక మంది అణగారిన వర్గాలకు చెందినవారు కూడా ఉన్నారు. అర్థవంతమైన సామాజిక ప్రభావాన్ని చూపిన వ్యక్తులను గుర్తించడానికి ఈ అవార్డులు తోడ్పడతాయి.
పద్మ అవార్డులను అందుకోనున్న వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 11 మంది ఉన్నారు. మామిడి రామారెడ్డి (పాడి, పశు సంవర్దక విభాగంలో సేవలు), కళా విభాగంలో టాలీవుడ్ నటులు మాగంటి మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, తెలంగాణకు చెందిన దీపికా రెడ్డి, సాహిత్యంలో వెంపటి కుటుంబశాస్త్రి (ఏపీ), విజయ్ ఆనంద్ రెడ్డి, గడ్డిమానుగు చంద్రమౌళి (తెలంగాణ), సంగీత కళాకారుడు, గతేడాది కన్నుమూసిన టీటీడీ మాజీ విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు మరణానంతరం పద్మశ్రీ దక్కింది.
యూజీసీ మాజీ ఛైర్మన్, నల్లగొండ జిల్లాకు చెందిన మామిడాల జగదీష్ కుమార్ (ఢిల్లీ), సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ (తమిళనాడు)ను జన్యసంబంధిత పరిశోధనలకు గానూ పద్మశ్రీ అవార్డులు వరించాయి. అంకె గౌడ (సాహిత్యం- కర్ణాటక), భగవాన్ దాస్ రాయికర్ (మధ్యప్రదేశ్), ఆర్మిడ్ ఫెర్నాండేజ్ (మహారాష్ట్ర), శ్యామ్ సుందర్, చిరంజిలాల్ యాదవ్ (ఉత్తర్ ప్రదేశ్), రఘుపతి సింగ్, బ్రిజ్‌లాల్ భట్ (జమ్మూ కశ్మీర్), రామచంద్ర, సీమాంచల్ పాత్రో, తేచీ గుబిన్, కేమ్ రాజ్ సుందర్, ఇంద్రజీత్ సింగ్, ఆర్. క్రిష్ణన్, షఫీ షౌక్, పున్‌మూర్తి కాటేసన్,
పంజివేల్, కళ్లాష్ చంద్ర, భగవాన్ దాస్ రాయికర్, ఎస్. జే. సుశీలమ్మ, భికల్యా లడక్యా ధిండా, బుధ్రి తాటి (ఛత్తీస్‌గఢ్), చరన్ హెమాంబ్రమ్, ధర్మిక్లాల్ ఛునియలాల్ పాండ్య, గఫ్రూద్దీన్ మేవాత్ జోగి, హల్యా వార్, కైలాష్ చంద్ర పంత్, ఖేమ్ రాజ్ సుందర్యాల్, కొలక్యిల్ దేవకి అమ్మ, మహేంద్ర కుమార్ మిశ్రా, మిర్ హజ్‌బాయ్ కసంభాయ్, మోహన్ నగర్, నరేశ్ చంద్ర దేవ్ వర్మ, నిలేష్ వినోద్‌చంద్ర మాండ్లేవాలా, నూరుద్దీన్ అహ్మద్, ఒథువర్ తిరుత్తణి స్వామినాథన్, పద్మ గుర్మీత్, పోఖిలా లేక్తిపీ, రఘువీర్ తుకారామ్ ఖేడ్కర్ (మహారాష్ట్ర), రాజసత్పతి కలియప్ప గౌండర్, రామచంద్ర గోడ్బెల్-సునీత్ గోడ్బెల్, సంగ్‌యుసంగ్ ఎస్ పొంగేనేర్, షఫీ షౌక్, శ్రీరంగ దేవబ లాడ్, సురేశ్ హనంగ్‌వడి, తాగా రామ్ భీమ్, తైచీ గుబిన్, తిరువరూర్ భక్తవత్సలం, విశ్వ బంధు, యుమ్నామ్ జత్రా సింగ్ తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa