సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో ఆదిపురుష్ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రేక్షకులు ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్లను కోరుకుంటున్నారు. చిత్రబృందం మాత్రం సైలెంట్ గా పని కానిచ్చేస్తూ, ప్రేక్షకులను ఇంకా సస్పెన్స్ లోనే ఉంచుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్క విషయం కూడా ఇప్పటివరకు అధికారికంగా ప్రకటింపబడలేదు.
తాజాగా ఈ సినిమాపై వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.., ఇటీవలే ఆదిపురుష్ డైరెక్టర్ ఇంట్లో చిత్రబృందమంతా సమావేశమైన విషయం అందరికి తెలిసిందే. ఈ సమావేశంలో ఆదిపురుష్ ఎడిటెడ్ వెర్షన్ ను ప్రదర్శించారట. ఇది చూసిన ప్రభాస్, ఇంకా మిగిలిన నటీనటులు డైరెక్టర్ ఓం రౌత్ ను ప్రశంసల్లో ముంచెత్తారట. ముఖ్యంగా ప్రభాస్, కృతిసనన్ ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యిందని కితాబిస్తున్నారట. దీంతో ప్రభాస్ చాలా ఆనందంగా ఉన్నారట.
ఎందుకంటే, రీసెంట్గా వచ్చిన రాధేశ్యామ్ లో హీరోహీరోయిన్ల మధ్య స్పార్కింగ్ కెమిస్ట్రీ మిస్సవ్వడంతో డిజాస్టర్ గా నిలిచింది. ఆదిపురుష్ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఒక ఎపిక్ అండ్ మైథలాజికల్ లవ్ స్టోరీ. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. సీతారాముల మధ్య ఉండే అన్యోన్యత, గాఢమైన ప్రేమ, నమ్మకం... ఇవన్నీ అద్భుతంగా ఆవిష్కరించగలిగితేనే స్క్రీన్ మీద సీతారాములిగా ప్రభాస్, కృతిసనన్ లు ఎస్టాబ్లిష్ అవుతారు. ఈ విషయంలో దర్శకుడిగా ఓం రౌత్ సూపర్ సక్సెస్ అయ్యినట్టు తెలుస్తుంది. చూడాలి మరి... వెండితెరపై ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేస్తుందో... ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో.