ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్మాణ రంగంలో శృతి హాస‌న్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 28, 2018, 11:27 AM

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ రంగ ప్ర‌వేశం చేసిన శృతి హాస‌న్ అతి కొద్ది కాలంలోనే అగ్ర హీరోయిన్ స్ఠానానికి చేరుకుంది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో శ్రుతికి మంచి మార్కెట్ ఉన్నప్పటికీ నిదానంగా తనకి నచ్చిన కథలను మాత్రమే చేసుకుంటూ వెళుతోంది. ఇప్జా ఇప్పుడు శృతి నిర్మాత‌గా మార‌నుంది.. ఈ విష‌యం గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన తల్లితో కలిసి ఒక నిర్మాణ సంస్థను ఆరంభించినట్టు చెప్పింది.తెలిపింది. “మా అమ్మా నాన్నలు చాలా చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. వాళ్ల వారసురాలిగా నేను ఈ రంగంలోకి వచ్చాను. వాళ్లు గర్వపడేలా నా కెరియర్ ను మలచుకునే పనిలోనే వున్నాను. ఈ విషయంలో నాపై అంచనాలు వుండాలని నేను అనుకోను .. నాకు తోచినట్టుగా నేను అందుకు సంబంధించిన పనులను చేసుకుంటూ వెళుతుంటాను. ఇంతవరకూ నేను మా నాన్నకి సంబంధించిన సినిమాలకి పనిచేశాను .. ఆయనతో కలిసి పనిచేసినందుకు ఎంతో గర్వపడుతుంటాను. ఇక అమ్మతోనూ కలిసి పనిచేయాలనుకుంటున్నాను. అందుకే తనతో కలిసి ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించాను. నిజంగా ఇది నాకెంతో ఆనందాన్ని కలిగించే విషయంష అని పేర్కొంది. త్వ‌ర‌లోనే స్వంత నిర్మాణ సంస్థ ద్వారా మూవీలు నిర్మిస్తాన‌ని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa