ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ‌శేఖ‌ర్ క‌ల్కిలో థ‌న్సిక‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 28, 2018, 11:26 AM

సీనియ‌ర్ హీరో రాజశేఖర్ న‌టించిన‌ ‘గరుడ వేగ’ భారీ విజయాన్ని సాధించింది. చాలా కాలం తరువాత రాజశేఖర్ కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. దాంతో తరువాత సినిమా కూడా ఆ స్థాయి విజయాన్ని తెచ్చేది కావాలని భావించ‌డంతో కథల ఎంపిక విషయంలో ఆయన శ్రద్ధ పెట్టారు. రీసెంట్ గా ఆయనకి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక కథను వినిపించడం, ఆయన ఓకే చేసేయడం జరిగింది. ఈ సినిమాకి ‘కల్కి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. సి.కల్యాణ్ .. రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో అంజలిని కథానాయికగా తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా ‘కబాలి’ మూవీలో రజనీ కూతురుగా చేసిన సాయి ధన్సికను కూడా తాజాగా ఎంపిక చేసుకున్నారు. అంజలి స్థానంలో సాయిధన్సికను తీసుకున్నారా? లేదంటే ఇద్దరు కథానాయికలతో రాజశేఖర్ జోడీ కడుతున్నారా? అనే విషయం లో కొంత క‌న్ ఫ్యూజ్ ఉంది.. త్వ‌ర‌లోనే చిత్ర యూనిట్ అధికారికంగా హీరోయిన్స్ విష‌యాన్ని ప్ర‌క‌టించ‌నున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa