2019లో కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం ఖైదీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో స్టార్ హీరో కార్తీ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలుగులో కూడా అదే పేరుతో విడుదలై ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.
కార్తీ ఖైదీ సినిమాను హిందీలో "భోళా" గా రీమేక్ చేస్తున్నారు సీనియర్ హీరో అజయ్ దేవగణ్. ఆయన సొంత డైరెక్షన్లో నాల్గవ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మరో సీనియర్ హీరోయిన్ టబు ఫిమేల్ లీడ్ లో నటించబోతుందని అజయ్ ఈరోజు ఎనౌన్స్ చేసారు. నిజానికి ఒరిజినల్ ఖైదీ సినిమాలో హీరోయిన్ రోల్ పేరుకే.. స్క్రీన్ పై ఆమెను అస్సలు చూపించరు. మరి హిందీలో మాత్రం హీరోయిన్ ఉండడం విచిత్రంగా ఉంది. అంటే, హిందీ నేటివిటీకి తగ్గట్టు అజయ్ ఈ సినిమాలో భారీ మార్పులే చేసినట్టు ఉన్నారు. మార్పులు చేస్తే ఫర్లేదు కానీ, సోల్ మారకుండా ఉంటే హిందీలో కూడా ఈ సినిమా అద్భుతాలు చెయ్యగలదు.
![]() |
![]() |