సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి లీడ్ రోల్స్ లో డీజే టిల్లు సినిమా విడుదలై హిట్ టాక్ అందుకుంది. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే హీరో సిద్ధునే అందించారు. ప్రస్తుతం డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా డీజే టిల్లు2 రానుంది. అయితే డీజే టిల్లులో హీరోయిన్ నేహా శెట్టి పాత్ర చాలా తక్కువగా ఉంటుందని, హీరోయిన్ గా మరొకరు ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన రానుంది.