టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ మద్య కాలంలో సినిమాల సంఖ్యను తగ్గించాడు. కెరీర్ ఆరంభంలో సంవత్సరంలో పదికి మించి చిత్రాలు చేసిన మోహన్ బాబు హీరోగా అయిన తర్వాత చాలా తక్కువగా నటిస్తూ వచ్చాడు. ఇక ఈమద్య కాలంలో ఈయన సినిమాలు బొత్తిగా కరువయ్యాయి. అడపా దడపా నటిస్తూ వస్తున్న మోహన్ బాబు త్వరలో ఆసక్తికర పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. మోహన్ బాబు కెరీర్ ఆరంభంలో పలు చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించాడు. కామెడీ విలన్ గా - సీరియస్ విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేక మేనరిజంను ఏర్పాటు చేసుకున్న మోహన్ బాబు హీరగా కంటే ఎక్కువ అప్పట్లో విలన్ గానే గుర్తింపు దక్కించుకున్నాడు.
మళ్లీ ఇన్నాళ్లకు మోహన్ బాబును విలన్ గా చూడబోతున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబును విలన్ పాత్రకు అడిగేంత సాహసం తెలుగు దర్శకులు చేయలేదు. తాజాగా తమిళ హీరో సూర్య ఈయన్ను తన సినిమాలో విలన్ పాత్ర చేయాల్సిందిగా కోరినట్లుగా తెలుస్తోంది. తమిళంలో స్టార్ హీరో అయిన సూర్యకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఈయన త్వరలో తెలుగులో నటించబోతున్న తెలుగు సినిమాలో మోహన్ బాబు ఉంటే సినిమా క్రేజ్ పెరుగుతుందనే ఉద్దేశ్యంతో విలన్ గా మోహన్ బాబును ఎంపిక చేయాలని దర్శకురాలు సుధ కొంగరకు సూచించినట్లుగా తెలుస్తోంది.
సుధ కొంగర ఇటీవలే వెంకటేష్ హీరోగా ‘గురు’ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈమె చెప్పిన సబ్జెక్ట్ నచ్చడంతో సూర్య తెలుగు మరియు తమిళంలో ఈ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు. సూర్య సలహా మేరకు సుధ కొంగర ఇటీవలే మోహన్ బాబును కలిసి కథను చెప్పి ఒప్పించినట్లుగా సమాచారం అందుతుంది. ఈ వార్త నిజం అయితే ఇదో మినీ మల్టీస్టారర్ గా చెప్పుకోవచ్చు. ఈ వార్తలపై మోహన్ బాబు ఫ్యామిలీ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. నటుడిగా తనను తాను తృప్తి పర్చుకునేందుకు ఎలాంటి పాత్రలను అయినా చేసేందుకు సిద్దం అంటూ గతంలో మోహన్బాబు చెప్పాడు. అందుకే విలన్గా మళ్లీ నటించేందుకు ఆయన ఓకే చెప్పి ఉంటాడు అంటూ సమాచారం అందుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa