ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ చేతుల మీదుగా..."పొన్నియిన్ సెల్వన్" తెలుగు టీజర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 07:38 PM

ఇండియన్ క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం కలల ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ప్రఖ్యాత భారీ బడ్జెట్ చిత్రం "పొన్నియిన్ సెల్వన్". షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ 30 న విడుదలకానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ను షురూ చేసిన మేకర్స్ వారం రోజుల నుండి సినిమాలో కీలక పాత్రధారుల ఫస్ట్ లుక్ పోస్టర్ లను రిలీజ్ చేస్తూ వచ్చారు.
తాజాగా ఈ మూవీ టీజర్ కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేసారు. జూలై 8వ తేదీ అంటే రేపు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఈ మూవీ టీజర్ రిలీజ్ కానుంది. హిందీలో అమితాబ్ బచ్చన్ ఈ మూవీ టీజర్ ను విడుదల చేయబోతుండగా, తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చెయ్యనున్నారు.
2010లో మణిరత్నం డైరెక్షన్లో విక్రమ్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన పిదప ఈ సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి జతకట్టారు. వీరితో పాటు ఈ సినిమాలో కార్తీ, జయం రవి, త్రిష ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిరత్నం కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa