టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం "వారసుడు". ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మండన్నా హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో దిల్ రాజు కోలీవుడ్ నిర్మాణరంగంలోకి ప్రవేశిస్తున్నారు.
ఈ మూవీపై వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఫస్ట్ లిరికల్ సాంగ్ కు సంబంధించిన మొత్తం పనిని తమన్ ఇప్పటికే ముగించారట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఈ పాటను స్టార్ సింగర్ సిద్ధ్ శ్రీరామ్, జోనితా గాంధీ ఆలపించారట. త్వరలోనే ఈ మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ రాబోతుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa