ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రౌడీ స్టార్ తదుపరి సినిమాలో కన్నడ బ్యూటీ ఐటెం సాంగ్?

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 02:58 PM

సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో "జన గణ మన" సినిమా వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో విజయ దేవరకొండ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజ హెడ్జ్ జంటగా నటిస్తుంది. కొన్ని రోజులుగా ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక ఐటెం సాంగ్ లో కనిపించనుందని పుకార్లు వస్తున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం, ఈ వార్తలన్నీ అవాస్తవమని మరియు మేకర్స్ అలాంటి ప్లాన్‌లలో లేరని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా దేశభక్తి నేపథ్యంలో సాగే డ్రామా అని, అలాంటి పాటలకు స్కోప్ లేదని పూరీ క్యాంప్‌కి చెందిన ఒకరు వెల్లడించారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నా ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చనున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa