"పిట్టగోడ" సినిమాతో 2016లోనే సినీ కెరీర్ ను స్టార్ట్ చేసిన డైరెక్టర్ అనుదీప్ కేవీ 2021లో తెరకెక్కించిన "జాతిరత్నాలు" చిత్రంతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన అందించిన కథతో ఫస్ట్ డే ఫస్ట్ షో (FDFS) అనే సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. ఈ సినిమాకు డైలాగులు, స్క్రీన్ ప్లే కూడా అనుదీప్ అందించారు.
తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. హీరోయిన్ అడిగిన "ఖుషి" మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం హీరో పడే తంటాల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని తెలుస్తుంది. సన్నివేశాలు, BGM సరిగ్గా సింక్ అయ్యాయి. సీన్స్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. ఈ తరం యువత వ్యవహారశైలితో, ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ రెడ్డి, సంచితా బసూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మి నారాయణ్ కలిసి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు రాధన్ సంగీతం అందిస్తున్నారు. నిన్నటితరం సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ పూర్ణోదయా ఫిలిమ్స్ ఈ సినిమాతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుంది. శంకరాభరణం, స్వయం కృషి వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలను నిర్మించిన పూర్ణోదయా ఫిలిమ్స్ ను ఏడిద నాగేశ్వరరావు గారి మనవరాలు ఏడిద శ్రీజ తిరిగి పునఃప్రారంభించింది. శ్రీరామ్ ఏడిద సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు