టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కెరీర్లో తొలిసారి పవర్ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న చిత్రం "ది వారియర్". కోలీవుడ్ డైరెక్టర్ ఎన్. లింగుసామి డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతిశెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. 155.07 నిమిషాల సమయం తో అంటే రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీకి సెన్సార్ సభ్యులు యూ/ఏ సెర్టిఫికెట్ ను ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa