షారుఖ్ ఖాన్ హీరోగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'దేవ్ దాస్' చిత్రం మంగళవారానికి ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ రాసిన 'దేవదాసు' నవల ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ రూ.50 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2002 జూలై 12న విడుదలైన ఈ మూవీ అప్పట్లో విజయఢంకా మోగించింది.