ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నయనతార 75వ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 12, 2022, 12:09 PM

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తూ చాలా బిజీగా ఉంది. అట్లీ డైరెక్షన్లో షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి "జవాన్" అనే టైటిల్ ను ఫిక్స్ చేసి, ఇటీవలే టైటిల్ గ్లిమ్స్ ను విడుదల చేయగా, దానికి అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
లేటెస్ట్ గా నయన్ కెరీర్లో 75 వ సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది. జీ స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఫేమస్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన నీలేష్ కృష్ణా దర్శకత్వం వహిస్తున్నారు. జై, సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com