విడుదలైనప్పటి నుండి "విక్రమ్" సినిమా సృష్టిస్తున్న రికార్డులకు ఎక్కడా బ్రేక్ పడట్లేదు. లేటెస్ట్ గా ఈ మూవీ OST(ఒరిజినల్ సౌండ్ ట్రాక్) విడుదలవ్వగా, దానికి "స్పాటిఫై" లో వరల్డ్ టాప్ ఆల్బమ్స్ లో ఐదవ స్థానం దక్కింది. అనిరుధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో, ఇంతటి అరుదైన గౌరవం దక్కింది.
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. హీరో సూర్య "రోలెక్స్" అనే కీలక అతిధి పాత్రలో నటించి ప్రేక్షకులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు.