డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం "లైగర్". ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు.
తాజాగా ఈ మూవీ నుండి "అక్డి పక్డి" అని సాగే పాటను విడుదల చేసారు. పెప్పిగా, ఫుల్ జోష్ గా ఉన్న ఈ పాట మంచి పార్టీ సాంగ్ గా, చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ పాటలో విజయ్ గ్రేస్ స్టెప్పులు, అనన్యా గ్లామర్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నిన్న విడుదలైన ఈ పాట యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ మ్యూజిక్ లో, 13 మిలియన్ వ్యూస్ తో, 730కే లైక్స్ తో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది. పాన్ ఇండియా భాషల్లో ఆగస్టు 25న విడుదల కాబోతున్న ఈ చిత్రం పట్ల అటు నార్త్ లో, ఇటు సౌత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాతో భారతీయ సినీ రంగ ప్రవేశం చెయ్యడం విశేషం.