క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్, రష్మిక మండన్నా జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం "పుష్ప". గతేడాది విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నార్త్ లో ఐతే ఈ సినిమా ఒక ప్రభంజనం. దీంతో పుష్ప సీక్వెల్ పై దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఈ మూవీపై వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, 350 కోట్ల భారీ బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కబోతుందట. అందులో 90 కోట్లు అల్లు అర్జున్, 40-50 కోట్లు సుకుమార్, 50-75 కోట్లు మిగిలిన నటీనటుల పారితోషికం ...మొత్తమ్మీద పుష్ప 2 బడ్జెట్ 350 కోట్ల మార్కును తాకుతుందని అంచనా. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, ఆగస్టు నెల నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతోందని అంటున్నారు.