అక్కినేని యువనటుడు నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం "థాంక్యూ". శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా టైం తీసుకుంది. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూలై 8న విడుదలవుతుందనుకున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. జులై 22 న థియేటర్లలో సినిమా విడుదలవుతుందని ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
తాజాగా ఈ మూవీపై ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే, ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు స్కూల్ డేస్ లో నాగచైతన్య వీరాభిమానిగా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మహేష్ కు చైతూ అభిమానిగా నటిస్తుందన్న విషయం తెలుసుకుని, ఇరు స్టార్ల అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.