క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఇటీవలే తన 21 వ సినిమా "రంగమార్తాండ" ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగడం విశేషం. ఐతే, ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ "S.I.L.K" అనే మ్యూజిక్ లేబుల్ మీద విడుదల కాబోతుంది. విశేషమేంటంటే, ఈ మ్యూజిక్ లేబుల్ ను ఇంట్రడ్యూస్ చేసింది కృష్ణవంశీ గారే. ఆయనే ఈ కంపెనీని సొంతంగా స్టార్ట్ చేసారు. కానీ, S.I.L.K (సిల్క్) అని పేరు పెట్టడానికి కారణం ఏంటని చాలా మంది అయోమయంలో పడ్డారు. ఇంతకీ కృష్ణవంశీ ఆ పేరు ఎందుకు పెట్టారంటే, S అంటే కృష్ణవంశీ ఫేవరెట్ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, I.L అంటే కృష్ణవంశీ ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్ ఇళయరాజా గారు, ఇక K అంటే కృష్ణవంశీ. మొత్తంగా కలిపి S.I.L.K(సిల్క్) అయిందన్న మాట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa