సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, రష్మిక మండన్నా జంటగా నటించిన చిత్రం "పుష్ప". గతేడాది విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజులో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఉత్తరాదిన ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.
ఈ సినిమాలో అల్లుఅర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్రపై మనసు పారేసుకున్నానంటూ బాలీవుడ్ యంగ్ హీరో రణ్ బీర్ కపూర్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. "షంషేరా" ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్ బీర్ ఈ మధ్యకాలంలో తనకు బాగా నచ్చిన పాత్ర పుష్పరాజ్ అని, పుష్ప సీక్వెల్ కోసం ప్రేక్షకాభిమానుల లానే తాను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న బన్నీ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa