అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్లో తొలిసారి భారీ బడ్జెట్ తో నిర్మింపబడుతున్న చిత్రం "ఏజెంట్". సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సూపర్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాక్షివైద్య అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ జూలై 15వ తేదీ విడుదలవుతుందని మేకర్స్ సూపర్ అప్డేట్ ఇవ్వడంతో అఖిల్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. పోతే... ఈ టీజర్ హైదరాబాద్ లోని ఒక ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్లో విడుదల కాబోతుందట. ఇందుకోసం మేకర్స్ ఒక గ్రాండ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారట. ఈమేరకు రేపు కానీ ఎల్లుండి కానీ అధికారిక ప్రకటన వెలువడబోతుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa