ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫీషియల్: "థాంక్యూ" ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 15, 2022, 03:22 PM

'మనం' కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం "థాంక్యూ". విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నాగచైతన్య, రాశిఖన్నా జంటగా నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం కోసం అక్కినేని అభిమానులు గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా జులై 22 న థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతుంది.
లేటెస్ట్ గా థాంక్యూ ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ను ప్రకటిస్తూ, మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ మేరకు జూలై 16వ తేదీ సాయంత్రం నుండి వైజాగ్ లోని ఆంధ్రా యూనివర్సిటీ, సర్ CR రెడ్డి కాన్వొకేషన్ హాల్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. ఐతే, ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ ఎవరన్నది మేకర్స్ ఎనౌన్స్ చెయ్యలేదు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa