ట్రెండింగ్
Epaper    English    தமிழ்

SSMB28: సూపర్ స్టార్ రోల్ పై లేటెస్ట్ న్యూస్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 16, 2022, 11:56 AM

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ కాంబో సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కబోయే సినిమా ఆగస్టు నుండి పట్టాలెక్కబోతుందన్న విషయం తెలిసిందే. అదికూడా ఆగస్టు 9వ తేదీ నుండి అంటే ఆ రోజు మహేష్ బాబు పుట్టినరోజు కాబట్టి ఖచ్చితంగా ఆరోజు నుండే షూటింగ్ స్టార్ట్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.
ఈ మూవీపై వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం, ఇందులో మహేష్ మరోసారి పొలిటికల్ లీడర్ గా నటించబోతున్నాడట. దూకుడు, భరత్ అనే నేను సినిమాలలో రాజకీయ నాయకుడిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన మహేష్ ఈ సినిమాలో IT మినిస్టర్ గా కనిపిస్తాడని లేటెస్ట్ న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కానీ కొంతమందేమో, ఇప్పటివరకు త్రివిక్రమ్ రియల్ పాలిటిక్స్ ను కొంచెం కూడా టచ్ చెయ్యలేదని, స్ప్రెడ్ అవుతున్న న్యూస్ లో నిజం లేదని అంటున్నారు. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాలంటే, ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa