తెలుగు తెరపై అందాల ఆరబోతలో మంచి మార్కులు కొట్టేసిన కేతిక శర్మ క్రేజీ ఆఫర్ కొట్టేసింది. ఆమె నటించి రెండు వరుస సినిమాలు ' రొమాంటిక్', 'లక్ష్య' పరాజయం పాలైనా ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. కేతిక మూడో చిత్రం 'రంగ రంగ వైభవంగా' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే సాయితేజ్ కు జోడిగా అల రించడానికి ఛాన్స్ కొట్టేసింది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సముద్రఖని 'వినోదయా సితం' రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమాలో సాయితేజ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించ నున్నాడు. సాయితేజ్ సరసన కథానాయికగా కేతిక శర్మను ఫైనల్ చేశారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న కేతిక... అందాల ఆరబోతుకు ఏ మాత్రం వెనకాడదనే పేరు కూడా సంపాదించు కుందని, సక్సెస్ లు లేకపోయినా గ్లామర్ తో వరుస అవకాశాలు పట్టేస్తుందని టాలీవుడ్ లో చెవులు కొరుక్కుంటున్నారు.