హీరో విక్రమ్ కీలక పాత్రలో దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న పొన్నియిన్ సెల్వన్ వివాదంలో చిక్కుకుంది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో రచించిన నవల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా చోళ రాజులను తప్పుగా అభివర్ణించే అవకాశం ఉందంటూ సెల్వమ్ అనే న్యాయవాది తాజాగా కోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో పాటు విడుదలకంటే ముందు తన కోసం ప్రత్యేక షో వేయాలని కోరుతూ మణిరత్నం, విక్రమ్‌లకు నోటీసులు పంపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa