ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాన మూవీ నుంచి 'ఎదుట నిలిచింది చూడు' సాంగ్ లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 19, 2022, 12:18 PM

వాన మూవీ నుంచి 'ఎదుట నిలిచింది చూడు' సాంగ్ లిరిక్స్:
పల్లవి:


ఎదుట నిలిచింది చూడు… జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు… చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయ మాయలో…
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా… ఆ ఆఆ
ఎదుట నిలిచింది చూడు…

చరణం 1:
నిజంలాంటి ఈ స్వప్నం… ఎలా పట్టి ఆపాలి
కలే ఐతే ఆ నిజం… ఎలా తట్టుకోవాలి
అవునో, కాదో… అడగకంది నా మౌనం
చెలివో, శిలవో… తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే… జన్మ ఖైదులా
ఎదుట నిలిచింది చూడు

చరణం 2:
నిన్నే చేరుకోలేక… ఎటెళ్ళిందో నా లేఖ
వినేవారు లేక… విసుక్కుంది నా కేక
నీదో, కాదో… రాసున్న చిరునామా
ఉందో, లేదో… ఆ చోట నా ప్రేమ
వరం లాంటి శాపమేదో… సొంతమైందిలా ఆఆ

ఎదుట నిలిచింది చూడు… జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు… చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయ మాయలో…
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా… ఆ ఆఆ
ఎదుట నిలిచింది చూడు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com