హీరో మాధవన్ తాజాగా తానే దర్శకత్వం వహిస్తూ 'రాకేట్రి' అనే సినిమాను రూపొందించారు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవిత కథ ఆధారంగా ‘రాకేట్రి.. ది నంబి ఎఫెక్ట్’ పేరుతో సినిమా జులై 1న విడుదలైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో దీనిని విడుదల చేశారు. ఈ చిత్రం ఈ నెల 26వ తేది నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దాదాపు 240 దేశాల్లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం.