లోకనాయకుడు కమలహాసన్ కు అరుదైన గౌరవం లభించింది. పదేళ్ల కాలపరిమితితో కూడిన ప్రతిష్ఠాత్మక గోల్డెన్ వీసాను కమల్ కు యూఏఈ ప్రభుత్వం అందించింది. ఈ విషయాన్ని కమలహాసన్ తన ట్విటర్ ఖాతా ద్వారా గురువారం వెల్లడించారు.
ఈ మేరకు ఎమిరేట్స్ అధికారులు తనకు గోల్డెన్ వీసా అందిస్తున్న ఫొటోలను కమల్ పోస్ట్ చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీసాను గతంలో మలయాళ నటులు మోహన్ లాల్, మమ్ముట్టి కూడా అందుకున్నారు.