పోజులు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం హీరో యిన్లకు అలవాటే. బాలీవుడ్ భామలు మరీనూ ! ముంబైలో ఓ హాలీవుడ్ సినిమా ప్రీమియర్ జరుగుతుందంటే.. ఊరుకుంటారా ? హాలీవుడ్ రేంజ్ లో రెడీ అయిపోయి సందడి చేయరూ. హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అదే చేసింది. బుధవారం రాత్రి ముంబైలో జరిగిన 'ది గ్రే మేన్' ప్రీమియర్ షోకు అదిరేటి డ్రెస్ లో హాజరైంది. మెరిసే డ్రెస్ లో కీవేజ్ అందాలతో మైమరిపించింది. ఇక సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది రాధే, బూత్ పోలీస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. జాక్వెలిన్. ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాల్లో నటిస్తోంది. బిచ్చన పాండే, ఎటాక్, విక్రాంత్ రోనా, సర్కస్, రామ్ సేతు లైనప్ ఉంది. ఇప్పటికే బచ్చన్ పాండే, ఎటాక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. యావరేజ్ అనిపిం చుకున్నాయి. జులై 28న 'విక్రాంత్ రోనా' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అక్టోబర్ లో రామ్ సేతు, డిసెంబర్ లో సర్కస్ రిలీజ్ కానున్నాయి.