సుదీర్ఘకాలం ప్రేమలో ఉన్న నయనతార-విగ్నేష్ శివన్ గత నెల 9న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి లైవ్ ను ఓటిటీకి ఇచ్చారు. నెట్ ఫ్లిక్స్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం పెళ్లికి ముందు జరిగింది. కానీ అలా జరగలేదు. పెళ్లి తర్వాత నెట్ ఫ్లిక్స్ లో పెళ్లి వీడియో టెలికాస్ట్ కానుంది అన్నారు అది జరగలేదు. దీంతో ఇదంతా వట్టి ప్రచారమే అనుకున్నా రంతా. కానీ తాజాగా నెట్ ఫిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నాం. నయన్ - విఘ్నేష్ పెళ్లికి విజువల్స్ ప్రచారం చేయబోతున్నట్లు అధికారకంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొన్ని అద్భుతమైన ఫోటోలు పంచుకుంది.