వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం "ఎఫ్ 3". ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. సునీల్, సోనాల్ చౌహన్, మురళి శర్మ కీలకపాత్రలు పోషించారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు.
తాజాగా ఈ మూవీ డిజిటల్ స్టీమింగ్ లోకొచ్చింది. ప్రముఖ ఓటిటీలు నెట్ ఫ్లిక్స్, సోనీ లివ్ లలో ఎఫ్ 3 మూవీ ఈరోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో సూపర్ డూపర్ హిట్టైన ఈ చిత్రం ఓటిటిలో కూడా మంచి విజయమే సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.