టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ ఈ ఏడాదిలో "ఆడవాళ్ళూ మీకు జోహార్లు" సినిమాతో ప్రేక్షకులను పలకరించి, ఫర్వాలేదనిపించుకున్నాడు. ఎందుకో తెలియదు కానీ, కొన్నాళ్ల నుండి శర్వానంద్ ఎంచుకుంటున్న కథలు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చెయ్యలేక చతికిలపడుతున్నాయి. దీంతో ఒక సాలిడ్ హిట్ కోసం శర్వా వేకళ్ళతో ఎదురుచూస్తున్నాడు.
రైటర్ కం డైరెక్టర్ కృష్ణ చైతన్య డైరెక్షన్లో శర్వానంద్ ఒక సినిమా చేయబోతున్నట్లు ఎప్పటినుండో టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో శర్వానంద్ ఒక బిడ్డకి తండ్రిగా నటించబోతున్నాడట. లేటెస్ట్ గా ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ కంపోజర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయట. హ్యాపీ, రామ్, ఓయ్, పంజా, గోవిందుడు అందరివాడేలే సినిమాలకు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించారు యువన్.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందట. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి.