పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్ట్ గా చేస్తున్న బాలీవుడ్ చిత్రం "ఆదిపురుష్". మైథలాజికల్ ఎంటర్టైనర్ గా, హిందీ తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్ డైరెక్షన్ చేస్తున్నారు. ఓం రౌత్ బాలీవుడ్ లో చేసిన "తన్హాజి" నేషనల్ అవార్డు జాబితాలో మూడు అవార్డులతో సత్తా చాటింది. బెస్ట్ యాక్టర్ గా అజయ్ దేవగణ్, బెస్ట్ కాస్ట్యూమ్, పాపులర్ ఫిలిం కేటగిరీలలో తన్హాజి మూడు జాతీయ అవార్డులను గెలుచుకుంది. దీంతో ఓం రౌత్ సత్తా ఏంటో చాలా క్లియర్ గా అర్ధం చేసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ "ఆదిపురుష్" తో మరొకసారి తన ట్యాలెంట్ ను ప్రేక్షకులకు చూపిస్తాడని అతనిపై భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఇంతటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ తో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు ప్రభాస్ చాలా హ్యాప్పీగా ఉన్నాడట. దీంతో ఓం రౌత్ కు స్పెషల్ సర్ప్రైజ్ పార్టీని ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట. ఓం రౌత్ మరియు ఇంకొంతమంది ఆదిపురుష్ టీం కలిసి హైదరాబాద్ లో ప్రభాస్ ఇవ్వబోయే పార్టీకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తుంది.