అమెరికాకు చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు పాల్ సోర్వినో(83) మంగళవారం కన్నుమూశారు. ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లేలోని మాయో క్లినిక్‌లో సోర్వినో మరణించినట్లు ఆయన భార్య డీడీ సోర్వినో తెలిపారు. 1990లో వచ్చిన 'గుడ్‌ఫెల్లాస్' చిత్రం ద్వారా ఆయనకు ఎంతో పేరు వచ్చింది. ది గ్యాంబ్లర్, ది బ్రింక్స్ జాబ్, ది ఫర్మ్, నిక్సన్, రోమియో అండ్ జూలియట్, ది కూలర్ వంటి చిత్రాలలో ఆయన నటించారు.