'టైటానిక్' చిత్రంలో నటించిన డేవిడ్ వార్నర్ (80) కన్నుమూశారు. కొంత కాలంగా కేన్సర్‌తో బాధ పడుతున్న ఆయన సోమవారం ఆసుపత్రిలో మరణించారు. వార్నర్ 'టైటానిక్'లో బిల్లీ జేన్ సైడ్‌కిక్ స్పైసర్ లవ్‌జాయ్‌గా నటించాడు. అతను 'ది ఒమెన్', 'ట్రాన్' వంటి చిత్రాలలో కూడా నటించాడు. 1962లో ఆయన సినీ రంగ ప్రస్థానం మొదలైంది. ఆరు దశాబ్దాల పాటు ఎన్నో హాలీవుడ్ సినిమాలలో ఆయన నటించారు.