సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ట్యాలెంటెడ్ హీరోయిన్స్ లో మల్లూ బ్యూటీ నిత్యామీనన్ ఒకరు. తన పాత్ర, మూవీ కాన్సెప్ట్ నచ్చితే, ఏ చిన్న సినిమాలో నటించడానికైనా సిద్ధపడే నిత్యా మొదటి నుండి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తుంది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "భీమ్లానాయక్", "మోడరన్ లవ్ హైదరాబాద్" అనే వెబ్ సిరీస్ లో నటించిన నిత్యా తదుపరి ఏ కొత్త సినిమాలకు సైన్ చెయ్యలేదని, ఇందుకు కారణంగా నిత్యా పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు చాలా బలంగా వినిపించాయి.
ఈ మేరకు నిత్యా మీనన్ పెళ్లి కొన్నాళ్ల పాటు మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక, ఈ వార్తలతో విసిగిపోయిన నిత్యా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో స్పెషల్ వీడియో పోస్ట్ చేసి, అందరికి క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడప్పుడే తాను పెళ్లి చేసుకోబోవట్లేదని, అలాంటి ప్లాన్ కూడా చెయ్యట్లేదని చెప్పింది. ప్రస్తుతం తాను వెకేషన్ లో ఉనాన్నని, తనతో పాటు ఇంకెవరూ లేరని చెప్పింది. ఇలాంటి వార్తలు ఎవరో పనీ పాట లేనివారు సృష్టించే గాలి వార్తలని, కాస్తంత బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఇలాంటి వార్తలను రాస్తే బావుంటుందని అభిప్రాయపడింది.