ప్రముఖ హీరోయిన్ నిత్యా మేనన్, మలయాళ స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. గతంలో ఈ వార్తలను ఓ ప్రకటన ద్వారా ఖండించిన నిత్యా మరోసారి స్ట్రాంగ్ గా స్పందించి పుకార్లకు చెక్ పెట్టారు. తన పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా పని పాటా లేని వారు సృష్టించిన పుకార్లని తేల్చి చెప్పారు. వివాహం గురించి ప్రస్తుతానికి తనకెలాంటి ఆలోచన, ప్రణాళిక లేవని తెలిపారు.