' క్రిమినల్" మూవీ నుంచి 'తెలుసా మనసా' సాంగ్ లిరిక్స్:
పల్లవి:
తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా
ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు
ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు
వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా
ఇది ఏ జన్మ సంబంధమో
చరణం 1:
ప్రతి క్షణం…హు హు మూ
నా కళ్ళలో… నిలిచె నీ రూపం
బ్రతుకులో, ఓ ఓ… అడుగడుగున
నడిపె నీ స్నేహం
ఊపిరే నీవుగా… ప్రాణమే నీదిగా
పది కాలాలు ఉంటాను… నీ ప్రేమ సాక్షిగా
తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా
ఇది ఏ జన్మ సంబంధమో
డార్లింగ్, ఎవ్రీ బ్రీథ్ యూ టేక్
ఎవ్రీ మూవ్ యూ మేక్
ఐ విల్ బీ దేర్
వాట్ ఉడ్ ఐ డూ వితౌట్ యూ…?
ఐ వాంట్ టూ లవ్ యూ ఫరెవర్
అండ్ ఎవర్… అండ్ ఎవర్
చరణం 2:
ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో, ఓ ఓ…
తీగసాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా… కాలమే ఆగినా
మన ఈ గాథ మిగలాలి
తుదిలేని చరితగ
తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా
ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు
ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు
వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
ఆ హా ఆహా… ఆ హా
సినిమా: క్రిమినల్
మ్యూజిక్: కీరవాణి
సింగర్స్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి