గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో హీరోయిన్ సాయిపల్లవి నటించిన 'గార్గి' చిత్రం జూలై 15న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ హక్కులను 'సోనీ లివ్' వారు తీసుకున్నారు. వచ్చేనెల 2వ వారంలో వారు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com